భారత్ సమ్మిట్‌కు హైదరాబాద్ రెండవసారి ఆతిథ్యం: చామల

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌‌లో నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 12,13,14 తేదీల్లో భారత్ సమ్మిట్ (Bharat Summit)కు హైదరాబాద్ రెండవ సారి ఆతిథ్యం ఇవ్వబోతోందని కొనియాడారు. ప్రపంచంలో భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్ళు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలోకి అడుగు పెట్టామని చెప్పారు. రెండోసారి భారత్ సమ్మిట్ కు హైదరాబాద్ వేదిక కావడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ లో 70 దేశాల నుండి 1000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారని చెప్పారు.

భారత్ సమ్మిట్‌లో లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగించబోతున్నారని ఎంపీ చామల తెలిపారు. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరవుతారని చెప్పారు. ఒకప్పుడు కేవలం ఐటీ, ఫార్మా హబ్ గా ఉన్న హైదరాబాద్.. ఇప్పుడు గ్లోబల్ పాలసీ చర్చలకు కేంద్రంగా మారిందని కొనియాడారు. భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని.. విదేశీ పెట్టుబడులు, పటూరిజం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>