కలం, వెబ్ డెస్క్: పుట్టపర్తి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి (Duddukunta Sreedhar ) కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. శ్రీధర్ రెడ్డి కాన్వాయ్ ను టిప్పర్ ఢీకొట్టింది. పుట్టపర్తి నియోజకవర్గం బుచ్చయ్యగారిపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఫంక్షన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. శ్రీధర్ రెడ్డితో సహా ఆరుగురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసి వైసీపీ నేతలు ఆసుపత్రికి తరలివచ్చి శ్రీధర్ రెడ్డిని పరామర్శిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

