విజయవాడలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

కలం, వెబ్ డెస్క్: విజయవాడ (Vijayawada) సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నిరాహార దీక్ష టెంట్‌ను టీడీపీ తొలగించడంతో ముత్యాలపాడులో టీడీపీ, వైసీసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైసీపీ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ దుష్ప్రచారాలను ఖండిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు వర్గం దీక్షా శిబిరం దగ్గరకు చేరుకుంది.

రోడ్డుపై టెంట్ ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ టీటీపీ నేతలు టెంట్ ను తొలగించిన క్రమంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు టీడీపీ జెండాలు, మరోవైపు వైసీపీ జెండాలతో పోటాపోటీ నినాదాలు చేస్తుండటంతో ఇరువర్గాల మధ్య తోపులాట ముదిరి కుర్చీలు విసురుకునే స్థాయికి చేరింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శాంతి భద్రతలు కాపాడేందుకు రెండు వర్గాలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేత పెద్దారెడ్డి యాడికికి బయలుదేరారు. ఈ క్రమంలోనే తాడిపత్రిలో పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>