మెడిక‌ల్ స్టూడెంట్‌పై కారు ఎక్కించిన యువ‌కులు

క‌లం, వెబ్‌డెస్క్‌: యువ‌కులు మాల్‌లో కారు పార్కింగ్ చేస్తూ ఓ మెడిక‌ల్ స్టూడెంట్‌పైకి కారు ఎక్కించిన ఘ‌ట‌న రాజ‌మండ్రి (Rajahmundry)లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ‌మండ్రిలోని జీఎస్ఎల్ మెడిక‌ల్ కాలేజీ స్టూడెంట్ ప్రియాంక ఇటీవ‌ల ప్ర‌సాదిత్య మాల్‌లో సినిమా చూసేందుకు వెళ్లారు. పార్కింగ్ ద‌గ్గ‌ర ఆమె స్కూటీ నిలిపే క్ర‌మంలో ఇద్ద‌రు యువ‌కులు కారులో అక్క‌డికి వ‌చ్చారు. పార్కింగ్ విష‌య‌మై స‌ద‌రు యువ‌కుల‌కు, ప్రియాంక‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన యువ‌కులు ప్రియాంక స్కూటీపై వెళ్తుండ‌గా ఢీకొట్టారు. దీంతో ఆమె రోడ్డుపై ప‌డిపోయింది.

ఆ యువ‌కులు అంత‌టితో ఆగ‌కుండా కారును అలాగే న‌డుపుతూ ప్రియాంక పైకి ఎక్కించారు. కారు ప్రియాంక త‌ల‌పై నుంచి వెళ్ల‌డంతో ఆమెకు తీవ్ర గాయాల‌య్యాయి. మాల్ ద‌గ్గ‌ర ఉన్న వాళ్లు వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం అత్య‌వ‌స‌ర చికిత్స నిమిత్తం హైద‌రాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రియాంక‌ను ప‌రీక్షించిన వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయింద‌ని నిర్ధారించారు. యాక్సిడెంట్‌కు కార‌ణ‌మైన ఇద్ద‌రు యువ‌కుల‌ను ప్ర‌కాశ్‌న‌గ‌ర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ‌ద్యం మ‌త్తులోనే యువ‌కులు ఈ దారుణానికి పాల్ప‌డ్డార‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్రియాంక‌పై కారు ఎక్కించిన ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>