వన్డే వరల్డ్ కప్.. క్వాలిఫయర్ తేదీలు ఖరారు

కలం, వెబ్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2027 (ODI World Cup 2027) క్వాలిఫైయర్ (అర్హత) పోటీల తేదీలను ఐసీసీ ఖరారు చేసింది. 10 జట్లతో జరిగే క్వాలిఫయర్ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23వ తేదీ వరకు జరగనుంది. అయితే ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే వేదికను ఇంకా నిర్ణయించలేదు. 2027 ప్రపంచకప్ కోసం ఐసీసీ కొత్త అర్హత విధానాన్ని తీసుకొచ్చింది.

క్వాలిఫైయర్లో విజేతగా నిలిచిన జట్టు మాత్రమే ప్రపంచ కప్ ప్రధాన టోర్నమెంట్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. రెండో, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిరీస్ దశకు వెళ్తాయి. అక్కడ పోటీ పడి అగ్రస్థానంలో నిలిచిన జట్టు మిగిలిన ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. ఇక అసలు ప్రధాన వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ 2027 (ODI World Cup 2027) అక్టోబర్-నవంబర్ మాసాల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లోని 12 వేదికల్లో 14 జట్ల మధ్య జరగనుంది.

Also Read : భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భ‌ర్త‌..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>