వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం : అచ్చెన్నాయుడు

కలం, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత జగన్ (YS Jagan) పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సాఆర్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్సార్ మరణం రోజు జగన్ ప్రవర్తించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పుకొచ్చారు. వైఎస్సాఆర్ చనిపోయిన రోజు జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా తన తండ్రి కనిపించడ లేదని ఆందోళణ చెందుతుంటే.. ఆ సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఉన్నారని ప్రశ్​నల వర్షం కురిపించారు. తండ్రి శవం పక్కన పెట్టుకుని సీఎం పదవి కోసం జగన్ సంతకాలు సేకరించలేదా? అని అన్నారు. దీని బట్టి జగన్ అధికార దాహాం ఎలా ఉందో అర్థం అవుతుందని మండిపడ్డారు.

అంతేకాదు వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందనే అనుమానాన్ని గతంలోనే బొత్స సత్యనారాయణ వెల్లడించారని అచ్చెన్నాయుడు (Atchannaidu) పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలన కాలంలో ఆంధ్రప్రదేశ్ ను జగన్ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారన్న అచ్చెన్నాయుడు.. తెలుగు ప్రజలపై జగన్ కు ఎందుకు కక్ష ? అని నిలదీశారు. రాజధాని అమరావతికి ఒక్క వైసీపీ తప్ప తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు , దేశంలోని పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు. మొదట మూడు రాజధానులు అంటూ వితండ వాదన చేసిన జగన్.. ఇప్పుడు మావిగన్ అంటూ మరో వాదనను తెరపైకి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.

Read Also: మాఫియా పాలన నుంచి విముక్తి కల్పిస్తాం: బెంగాల్‌లో ప్రధాని మోదీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>