కలం, వెబ్‌డెస్క్: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. డిసెంబర్ 5న షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి వివాహం రఘురామ్ రెడ్డితో జరుగునున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ కుటుంబానికి షర్మిల వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం దంపతులతో పాటు ఆయన కుమార్తెకు ఇన్విటేషన్ కార్డ్ అందించారు. ముందుగా షర్మిల తన కుమార్తె పెళ్లిని బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో చేయాలని భావించారు. అయితే దీనికి ఆమె అన్న, వైసీపీ అధినేత జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడి మధ్య షర్మిల అంజిలి రెడ్డి (YS Anjili Reddy) వివాహ వేదికను మార్చారు. దీనిపై షర్మిల స్వయంగా ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటించారు. తన కుమార్తె పెళ్లి సమయంలో గొడవలు జరుగకుండా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే వివాహ వేదికను యలహంక ప్యాలెస్ (Yelahanka Palace) నుంచి మరో చోటకు మారుస్తున్నట్లు చెప్పారు. కానీ, ఎక్కడ అన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే యలహంక ప్యాలెస్ ఆస్తుల పంపకాల్లో తనకు, తన బిడ్డలకే వచ్చిందని షర్మిల (YS Sharmila) తేల్చి చెప్పారు. ఇక్కడ అంజిలి రెడ్డి పెళ్లి ఎక్కడ జరుగుతుందన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
Also Read : కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా తెలంగాణ: అమిత్ షా
Follow Us On : WhatsApp

