ఎల్‌నినో.. వేసవి తాగునీటిపై జిల్లా యంత్రాంగం సన్నద్ధత

కలం, ఖమ్మం బ్యూరో: రాబోయే వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఖమ్మం (Khammam) జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ‘మిషన్ భగీరథ ప్రత్యేక డ్రైవ్’ (Mission Bhagiratha Drive) నిర్వహించనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆమె అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

​ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా చేతిపంపులు, మోటార్లు, పైప్‌లైన్ లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయాలని, ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులను క్రమం తప్పకుండా శుభ్రపరిచి పకడ్బందీగా క్లోరినేషన్ నిర్వహించాలని సూచించారు. ప్రతి మండల కేంద్రంలో బ్లీచింగ్ పౌడర్ నిల్వలను అందుబాటులో ఉంచాలని, అత్యవసర సమయాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

అలాగే, తాగునీటి సమస్యలపై ప్రజలు వెంటనే ఫిర్యాదు చేసేందుకు మిషన్ భగీరథ టోల్ ఫ్రీ నంబర్ ‘1916’ గురించి గ్రామాలు, మండలాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఏ ఒక్క ఆవాసంలోనూ నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>