మహేష్ గౌడ్‌ను కలిసిన పోచారం భాస్కర్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో కలిసి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా మీనా బాగ్‌లో ఉన్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ అధికారిక నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు హాజ‌ర‌య్యారు. ఈ విందుకు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy) కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుని, నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను పోచారం భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమాల్లో పోచారం భాస్కర్ రెడ్డి వెంట బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఢిల్లీ పర్యటనకు వచ్చిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>