కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా తెలంగాణ: అమిత్ షా

కలం, వెబ్ డెస్క్: తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చేశారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఆరోపించారు. తెలంగాణ ప్రజలు దీన్ని ఎప్పటికీ క్షమించబోరన్నారు. తెలంగాణలో అవినీతిని కాంగ్రెస్ పార్టీ నిరోధించడానికి బదులు రాష్ట్రాన్నే అమ్మకానికి పెట్టిందన్నారు. ఇక్కడ అవినీతిని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు నిర్మూలించలేవని.. బీజేపీ పార్టీ మాత్రమే ఆ పని చేయగలదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే అది సాధ్యమన్నారు.

మా లక్ష్యం తెలంగాణనే..

ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో (Six Guarantees) ఒక్కటి కూడా అమలు కావడం లేదని అమిత్ షా (Amit Shah) ఆరోపించారు. ఇక తమ తదుపరి లక్ష్యం తెలంగాణనే అని.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో హస్తం పార్టీ వెంటిలెటర్ మీద ఉందని.. రాహుల్ గాంధీ కూడా కాపాడలేరన్నారు. సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని పారదోలేందుకు గట్టి చర్యలు తీసుకున్నారని.. అలాగే దేశం నుంచి డ్రగ్స్ భూతాన్ని కూడా అణచివేస్తామన్నారు. 2029, డిసెంబర్ 31 నాటికి గంజాయి లేని దేశంగా భారత్ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>