రోడ్డు విస్తరణ ఇరువైపులా సమానంగా చేపట్టాలి: రామారావు

కలం, బోనకల్: ఖమ్మం జిల్లా బోనకల్ (Bonakal) మండలం ముష్టికుంట్ల, గార్లపాడు రహదారి విస్తరణ పనులను రహదారికి ఇరువైపులా సమానంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కౌలు రైతు సంఘం అధ్యక్షులు జక్కుల రామారావు (Jakkula Ramarao) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ముష్టికుంట్ల, గార్లపాడు గ్రామాల మధ్య జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావుతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులను కలిసి, పనుల వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలును అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జక్కుల రామారావు మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పేరుతో ఏ ఒక్క రైతుకు నష్టం వాటిల్లకుండా, ఇరువైపులా సమాన కొలతలతో పనులు చేపట్టాలని అధికారులను కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర పరిశీలన జరిపి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ మండల అధ్యక్షులు కొంగర భాస్కరరావు, సీపీఐ మండల నాయకులు ఆకిన పవన్, సీపీఎం నాయకులు షేక్ నజీర్, డిహెచ్పీఎస్ నాయకులు కాకాటి కరుణాకర్, రైతులు షేక్ ఫయాజ్, రజబ్ అలీ, గాయాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>