కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి వైఎస్‌ జగన్ ఓదార్పు

కలం, వెబ్ డెస్క్ : వైసీపీ రాష్ట్ర ప్రచారం విభాగం అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్‌ ఛైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌ ఇటీవలే హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) ఒంగోలులోని రాజశేఖర్‌ నివాసానికి చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజశేఖర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్‌, ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. రాజశేఖర్‌ అకాల మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

పార్టీకి, ముఖ్యంగా ప్రచార విభాగంలో రాజశేఖర్‌ అందించిన సేవలు చిరస్మరణీయమని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇటీవల కాకుమాను రాజశేఖర్‌ హైదరాబాద్‌లో గుండెపోటుతో హఠాన్మరణం చెందడం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. రాజశేఖర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ మరచిపోదని తెలిపారు. కాగా, తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఒంగోలు వచ్చిన జగన్‌కు వైసీపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>