Mobile Popup Ad
Mobile Popup Ad

గుండారాజ్యం నడుపుతున్నారా?.. టీడీపీపై జగన్ ఫైర్

కలం, వెబ్ డెస్క్ : అమరావతి రాజధాని ఉండవల్లి సెంటర్ లో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై జరిగిన దాడి అంశంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) స్పందించారు. ప్రభుత్వం నడుపుతున్నారా?.. గుండారాజ్యం నడుపుతున్నారా? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ నేతలు పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఫైర్ అయ్యారు.

అమరావతి పేరుతో దోపిడికీ పాల్పడుతున్నారని.. వాస్తవాలు బయటకు రాకుండా ఉండేందుకు తమ నేతలపై దాడులు చేశారని మండిపడ్డారు. అమరావతి పేరుతో టీడీపీ దారుణలకు రైతులు బలి అవుతున్నారన్న జగన్… రైతులకు వైసీపీ అండగా నిలబడటం తప్పా? అని నిలదీశారు. ఇప్పటికే అమరావతి పేరుతో వేలాది ఎకరాలు లాక్కున్నారని ఆరోపించారు. బీనామీలకు పంచేందుకే భూసేకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి కోసం జింగిల్ రాజ్యాన్ని టీడీపీ స్థాపించిందన్నారు. ఏది ఏమైనా మీ దాడులకు వైసీపీ తలవంచదు అని టీడీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>