ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం, వెన్నుపోటు పార్టీ పాలన : జగన్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో రెడ్‌బుక్‌ రాజ్యాంగం.. వెన్నుపోటు పార్టీ పాలన నడుస్తోందని వైసీసీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలు జైలులో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ అయి ధైర్యం చెప్పారు. అనంతరం జగన్ మీడయాతో మాట్లాడారు. అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉన్నదో విరూపాక్షి సంఘటనే ఉదాహరణగా నిలుస్తోందన్నారు.

రెడ్ బుక్ రాజ్యాంగం, కూటమి పాలనలో కుట్ర రాజకీయాలకు తెరలేపారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెన్నుపోటు పార్టీ నాయకుడు రచించిన కుట్ర రాజకీయాలే ఇందుకు ఉదాహరణ అని పరోక్షంగా సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలబడిన వారినే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.

నిలదీసిన వారు ఎవరైనా.. ఆఖరికి ఎమ్మెల్యే అయినా ఇంట్లోకి చొరబడి మరీ అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారని జగన్ అన్నారు. తప్పులు టీడీపీ వాళ్లు చేసి విరూపాక్షిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో బాధితులే నిందితులవుతున్నారని.. ఈ విషయంపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని జగన్ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>