కలం, వెబ్ డెస్క్: భుజానికి గాయం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. సర్జరీ విజయవంతంగా పూర్తైన అనంతరం వైద్య బృందంతో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ చేతికి సపోర్ట్‌గా స్లింగ్ ధరించి కనిపించారు. డాక్టర్లతో కలిసి చిరునవ్వుతో ఉన్న ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ విజయవంతం కావడంతో త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు.

