నేడు, రేపు పులివెందులలో వైఎస్‌ జగన్‌ పర్యటన

కలం, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) తన సొంత నియోజకవర్గమైన పులివెందుల(Pulivendula)లో రెండో రోజుల పాటు పర్యటించనున్నారు. నేడు, రేపు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా దివంగత మాజీ సీఎం , తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. షెడ్యూల్ ప్రకారం.. నేడు మధ్యాహ్నం 12 గంటలకు జగన్ పులివెందులకు చేరుకోనున్నారు. ఆ తర్వాత భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు.

దివంగత మాజీ సీఎం, తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి (YSR) వర్ధంతి సందర్భంగా రేపు ఉదయం పులివెందుల నివాసం నుంచి బయలు దేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, తండ్రి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. వర్ధంతి కార్యక్రమం పూర్తయిన తర్వాత జగన్ అక్కడి నుంచి బెంగళూరు వెళ్తారు.

Also Read :  రోహిత్ కెప్టెన్సీపై సూర్యకుమార్ ప్రశంసలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>