ఢిల్లీకి రేవంత్ : కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర జలశక్తిశాఖ నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తిన బాట పట్టారు. ఈ సమావేశంలో ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ఎత్తు పెంపుపై కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి విస్తృతంగా చర్చించనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు (Irrigation Projects) సంబంధించిన అనుమతులు, రాష్ట్ర ప్రయోజనాల సాధనే లక్ష్యంగా ఈ భేటీ సాగనుంది.

కేంద్రంతో జరిపే అభివృద్ధి చర్చలతో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో కూడా సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో త్వరలోనే జరగనున్న మంత్రివర్గ విస్తరణపై స్పష్టత తెచ్చుకోవడానికే ఈ భేటీలు జరగనున్నాయి. దీంతో పాటుగా, ఇటీవల ఎదురైన వివాదాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే అంశంపై అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఏఐసీసీ పెద్దలతో ముఖ్యమంత్రి తుది చర్చలు జరపనున్నారు.

మరోవైపు మంత్రివర్గ విస్తరణ (Cabinet Reshuffle) ప్రచారం ఊపందుకోవడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం ఢిల్లీ పర్యటన ముగిసేలోగా క్యాబినెట్ కూర్పు, మార్పులపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Also Read :  సామాన్యులకు బిగ్ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>