సికింద్రాబాద్ రెజిమెంట్‌లో ఆయుధాలు మాయం!

కలం, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్‌ (Secunderabad Madras Regiment)లో భారీగా ఆయుధాలు మాయమవడం తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ ఆర్మీ రెజిమెంట్ ఆయుధాల గది తలుపులను ఆదివారం అర్ధరాత్రి దుండగులు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు.

ఈ చోరీలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు మొత్తం 12 అత్యాధునిక ఆయుధాలు, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై రెజిమెంట్ అధికారులు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అత్యంత భద్రత కలిగిన ఈ ప్రాంతంలోకి బయటి వ్యక్తులకు ప్రవేశం లేకపోవడంతో, లోపల పనిచేసే సిబ్బందే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ వ్యవహారాన్ని రహస్యంగా విచారిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>