బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (Ramchander Rao)ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా పర్యటనకు బయల్దేరేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు అడ్డుకొని ఇంటికే పరిమితం చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, ఈ ఘర్షణలో వర్షిత్ రెడ్డి తల్లితో సహా కుటుంబ సభ్యులపై దాడి చేశారని బీజేపీ ఆరోపించింది.

ఈ క్రమంలో బాధితులను నేరుగా కలిసి పరామర్శించేందుకు రామచందర్ రావు నల్గొండ వెళ్లాల్సి ఉండగా, పోలీసులు ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించి తార్నాకలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఈ చర్యపై బీజేపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినే అడ్డుకోవడం ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>