కలం, సోన్ : సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (Kadthal School) సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థులు కోరారు. ఈ మేరకు శనివారం గ్రామ సర్పంచ్ గుర్రం రామును గ్రామపంచాయతీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు కమలాకర్ ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ పొందారని, అప్పటి నుంచి ఆ పోస్టును భర్తీ చేయలేదని విద్యార్థులు తెలిపారు. దీంతో సాంఘిక శాస్త్రం పాఠాలు సక్రమంగా సాగడం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డీఈఓ దృష్టికి తీసుకెళ్లగా, బీరవెల్లి పాఠశాల నుంచి పదో తరగతి విద్యార్థులకు సిలబస్ బోధించేందుకు నెల రోజుల పాటు ఉపాధ్యాయుడిని పంపే ఏర్పాటు చేస్తామని చెబుతున్నట్లు వివరించారు. ఏడాదిన్నరగా ఉపాధ్యాయుడు లేక ఇబ్బందులు పడుతుంటే కేవలం నెల రోజుల పాటు బోధిస్తే సిలబస్ ఎలా పూర్తవుతుందని, పాఠాలు పూర్తిస్థాయిలో ఎలా అర్థమవుతాయని విద్యార్థులు ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిప్యూటేషన్‌పై సోషల్ టీచర్‌ను వెంటనే కేటాయించాలని కోరారు.

