చంద్రబాబుపై జగన్ ఆగ్రహం.. కీలక ప్రకటన!

కలం, వెబ్ డెస్క్: ఏపీలో తీవ్రంగా కరువు పరిస్థితులున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే కరువు ప్రాంతాల్లో పర్యటిస్తానని కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన చెందారు. తక్షణమే కరువు మండలాల జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 51 శాతానికి పైగా లోటు వర్షపాతం ఉందన్నారు. 688 మండలాలు ఉంటే.. 628 మండలాల్లో కరువు ఉందన్నారు. వీటిలో సుమారు 332 మండలాల్లో పరిస్థితులు ఇంకా అధ్వానంగా ఉన్నాయని వివరించారు. ఎల్ నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే వాతావరణ శాఖ హెచ్చరించినా.. ప్రభుత్వం కనీస జాగ్రత్తలు చేపట్టకపోవడమేంటన్నారు.

పోలవరంపై రాజీ పడ్డారు..

సుమారు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా వేయలేకపోయారని.. ఇప్పటికే సాగు చేసిన ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పండ్ల తోటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. శ్రీశైలం నీటిని రాయలసీమకు మళ్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పోలవరం పూర్తి సామర్థ్యంపై చంద్రబాబు రాజీ పడుతున్నారని ఆరోపించారు. పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరందించే మార్గాలను అన్వేషించాలన్నారు. పులిచింతల వద్ద తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న లిఫ్ట్‌లను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>