కలం, వెబ్ డెస్క్: ఒకప్పుడు క్రికెట్ మైదానంలో బౌలర్లలో వణుకు పుట్టించిన వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఇప్పుడు ఒక కొత్త అవతారంలో కనిపించాడు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో యముడిగా ఉన్న ఉన్న ఫోటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదంతా ఆయన త్వరలో హోస్ట్ చేయబోయే ‘రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2’ అనే కొత్త రియాలిటీ షో ప్రమోషన్‌లో భాగంగా జరిగింది. టీవీ, ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ఈ షో పవర్, వ్యూహం, గేమ్ ప్లాన్‌పై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.
ఈ షోలో కంటెస్టెంట్లు రాజుగా మారే అవకాశం దక్కించుకుంటూ ఒకరితో ఒకరు పోటీ పడనున్నారు. ఇప్పటికే ఈ షోకి సంబంధించి నలుగురు కంటెస్టెంట్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. సెహ్వాగ్ తనదైన ప్రత్యేక శైలిలో హోస్ట్ చేయనున్న ఈ షో ప్రేక్షకులను ఎంతగానో అలరించనుంది. ప్రస్తుతం వీరేంద్ర సెహ్వాగ్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంలో ఫ్యాన్స్ “బౌలర్ల పాలిట అసలైన యముడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

