Mobile Popup Ad
Mobile Popup Ad

విశాఖ స్టీల్​ప్లాంట్ ఘోరంపై జగన్​ దిగ్భ్రాంతి​

కలం, వెబ్​ డెస్క్​ : విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రమాదంపై మాజీ సీఎం, వైసీపీ చీఫ్​ వైఎస్​.జగన్ (YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో కార్మికులు మరణించడం అత్యంత విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి జగన్ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. పేలుడుకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్​ చేశారు.

పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జగన్​ (YS Jagan) సూచించారు. ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు జగన్​ ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా పర్యవేక్షించాలని పార్టీ శ్రేణులకు జగన్​ సూచించారు.

Read Also: గోదావరి పరిశుభ్రతపై రాజీ పడే ప్రసక్తే లేదు : పవన్ కల్యాణ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>