కలం, వెబ్ డెస్క్ : గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నది పరిశుభ్రత, కాలుష్య నియంత్రణ అంశాలపై ఆయన అధికారుల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకైన గోదావరి (Godavari River) పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నదిలో కాలుష్యం పెరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారుల నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులలో అలసత్వం వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో పరిశుభ్రత, భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

