కలం, వెబ్ డెస్క్ : వైఎస్ కుటుంబాన్ని ఉద్దేశించి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (Btech Ravi ) సంచలన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబం చేసిన అరాచకాలను మర్చిపోయి ఇవాళ జగన్ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే టీడీపీని విడిచిపెట్టి రాలేదని పరిటాల రవిని చంపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మద్దెలచెరువు సూరితో వైఎస్ కుటుంబానికి స్నేహ సంబంధాలు లేవా? అని ప్రశ్నించారు. జైలులో ఉండి ప్లాన్ చేసి పరిటాల రవిని హత్య చేయిస్తారా అంటూ మండిపడ్డారు. మొదట బళ్లారిలో ఆర్కేని చంపేశారని, పరిటాల రవి అనుచరుడు అనంతపురంలో తగరకుంట ప్రభాకర్‌రెడ్డిని కూడా హత్య చేశారని పేర్కొన్నారు.
ప్రజల్లో ఆదరణ కలిగిన నేతలను బతకనిచ్చేవారు కాదని .. ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్టు చంపేసిన పరిస్థితులు వైఎస్ కుటుంబానినిది అని తెలిపారు. వైఎస్ కుటుంబం జోలికి ఎవరైనా వెళ్తే వాళ్లు ఎవరినైనా దారుణంగా చంపేస్తారని ఆరోపించారు. వైఎస్ రాజారెడ్డిని నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టిన వెంకటనరసయ్యను అతి కిరాతకంగా హత్య చేశారని .. 1962లోనే పులివెందుల పోలీస్ స్టేషన్‌లో వైఎస్ రాజారెడ్డి పేరుతో రౌడీ షీట్ ఉందని తెలిపారు. మంగంపేట బైరైటీస్ వశం చేసుకుని దాని నుంచి వచ్చిన సంపాదనతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారని తెలిపారు. జగన్ తన తాతలాగే అనేక ఆరాచకాలు చేశాడని వెల్లడించారు. ఈ క్రమంలోనే తమకు తెలిసిన జగన్ వేరు.. ప్రజలకు తెలిసిన జగన్ వేరు అని వ్యాఖ్యానించారు.

