కలం, వెబ్ డెస్క్ : జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు ముందే ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee)ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురుగ్రామ్ పోలీసుల సహకారంతో సెక్టర్ 56లోని ఆయన నివాసంలో ఈ ఉదయం ఢిల్లీ పోలీసులు ఈ చర్య చేపట్టారు. అనుమతి లేని ఈ ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు ముందస్తు చర్యగా పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు.
మరోవైపు, ఈ ఆందోళన కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న సీజేపీ (CJP) ముఖ్య నాయకులు ఇంకా ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. వారు నగరానికి చేరుకునే అవకాశం ఉండటంతో విమానాశ్రయం, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను అధికం చేశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఢిల్లీ పోలీసులు నగరవ్యాప్తంగా భారీగా బలగాలను మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

