కదులుతున్న కారులో ఒక్కసారిగా మంటలు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే?

కలం, వెబ్ డెస్క్: అనంతపురం నగరంలోని తపోవనం జాతీయ రహదారి (Tapovanam National Highway) పై ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కారు సర్వీసింగ్ చేయించుకుని తిరిగి వస్తుండగా ఎంజీ కంపెనీకి చెందిన కారులో అకస్మాత్తుగా మంటలు (MG Car Fire) వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో కారు సగానికి పైగా కాలిపోయింది.

కారులో మంటలు రావడాన్ని గమనించిన కారు యజమాని వెంటనే అప్రమత్తమై, సమయస్ఫూర్తితో కిందకు దిగిపోవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను పూర్తిగా అదుపు చేశారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>