ఏటీఎంలో చోరీకి స్కెచ్.. చివరకు అరెస్ట్

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలోని దేవి రోడ్డులో ఉన్న ఓ బ్యాంకు ఏటీఎంలోకి అక్రమంగా ప్రవేశించి, ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దొంగిలించేందుకు ప్రయత్నించిన నిందితుడిని (ATM Theft) టౌన్-1 పోలీసులు (Nizamabad Police) అరెస్ట్ చేశారు.

అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్-1 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఏటీఎంను ధ్వంసం చేసి నగదు చోరీకి యత్నించిన వ్యక్తిని  ఎడపల్లి మండలం జానకంపేట్‌కు చెందిన కర్నాల నాగరాజుగా గుర్తించి పట్టుకున్నారు. ఏటీఎంలో అలారం మోగడంతో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు విచారణలో వెల్లడైంది. ప్రత్యేక బృందాల సమన్వయంతో పోలీసులు నిందితుడిని త్వరితగతిన అరెస్ట్ చేశారు.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

బ్యాంకులు, ఏటీఎంల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>