బీజింగ్‌లో ట్రంప్ సెన్సేషన్: చైనాతో భారీ ఒప్పందాలు!

కలం, వెబ్‌ డెస్క్‌ : బీజింగ్‌లో డొనాల్డ్ ట్రంప్ (Trump), షీ జిన్‌పింగ్ మధ్య కీలక చర్చలు ముగిశాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ఈ భేటీ అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు అమెరికా, చైనాలకు ఎంతో మేలు చేస్తాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

చైనా అధ్యక్షుడిని గొప్ప వ్యక్తిగా అభివర్ణించిన ట్రంప్, ఆయన పట్ల తనకు అమితమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో సమస్యలను ఈ సమావేశంలో పరిష్కరించుకున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా ఇరాన్ సంక్షోభం త్వరగా ముగియాలని కోరుకుంటున్నామని, ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటాన్ని తాము ఇష్టపడటం లేదని స్పష్టం చేశారు. అలాగే సముద్ర జలసంధి మార్గాలు ఎప్పుడూ తెరిచే ఉండాలనే అంశంపై చర్చించినట్లు వివరించారు.

సెప్టెంబర్ 24వ తేదీన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికాలో పర్యటిస్తారని ట్రంప్ ప్రకటించారు. చైనాలో తనకు లభించిన ఆతిథ్యంలాగే, జిన్‌పింగ్ పర్యటన కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. ఈ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లేటప్పుడు జిన్‌పింగ్ కూడా ఎంతో సంతృప్తిగా వెళ్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>