కలం, వెబ్ డెస్క్: లైవ్ స్ట్రీమింగ్‌లో 80వేల మందికి పైగా చూస్తుండగా జరిగిన యాక్సిడెంట్లో ఓ యూట్యూబర్(Anurag Dobhal) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, కుటుంబం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనురాగ్ దోభాల్.. బైక్ రైడింగ్ ద్వారా వివిధ ప్రదేశాలు తిరుగుతూ, ఆ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేసేవాడు. యూకే 07 రైడర్ పేరుతో ఉండే అతని అకౌంట్‌కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఆ పాపులారిటీతోనే అతను హిందీ బిగ్‌బాస్ 17కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో శనివారం అనురాగ్ తన ఫార్చూనర్ కారులో వెళుతూ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేశాడు. ఇదే లాస్ట్ డ్రైవింగ్ అని చెబతూ, వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటన గజియాబాద్‌లోని మసూరి ఏరియాలో ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనురాగ్‌ను(Anurag Dobhal) పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కాగా, కుటుంబసభ్యులతో విభేదాల వల్ల అనురాగ్ ఆత్మహత్యాయత్నం చేశాడని అనుమానిస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్‌లో డ్రైవింగ్ చేస్తూ ఇదే ‘ఫైనల్ డ్రైవ్’ అని చెప్పడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దీనికి తోడు కుటుంబ సభ్యుల కారణంగా తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అంతకుముందు అనురాగ్ వీడియోల్లో చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను అనురాగ్ మేనేజర్ కొట్టేశారు. ఊహాగానాలు వద్దని విజ్ఞప్తి చేశారు. అయితే, అనురాగ్ కుటుంబ సభ్యులు తమ తప్పేమీ లేదని, అనురాగ్ మాటలు విని ఒకవైపు నమ్ముతున్నారని అంటున్నారు. ఏదేమైనా దేశవ్యాప్తంగా బైక్ రైడింగ్‌తో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్న అనురాగ్ ఇలాంటి చర్యకు పాల్పడడం అతని అభిమానులను షాక్‌కు గురిచేసింది.
Read Also: విమెన్స్ డే స్పెషల్ : బ్రిలియంట్ ఆఫీసర్.. సైలెంట్ ఆపరేషన్
Follow Us On: Facebook

