సంక్షోభంలో సహాయం.. లులు గ్రూప్‌కు కృతజ్ఞతలు : లోకేశ్

కలం, వెబ్ డెస్క్ : యూఏఈ (UAE) లో ఏర్పడిన ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు.. విమానాల ద్వారా ఆహార సరఫరాలను పంపిస్తున్న లులు గ్రూప్‌ సంస్థ (Lulu Group), వ్యవస్థాపకుడు  ఎంఏ యూసఫ్ అలీ (MA Yusuff Ali)కి  ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బాధ్యతాయుతమైన సంస్థలు..  తమ వినియోగదారులు, సమాజం పక్కన నిలబడటం ఎంతో గొప్ప విషయం అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం లులు గ్రూప్‌తో కలిసి రిటైల్ మాల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతి లాజిస్టిక్స్ రంగాల్లో భాగస్వామ్యం కొనసాగించడం గర్వకారణమని నారా లోకేష్  తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>