కలం, వరంగల్ బ్యూరో : జనగామ జిల్లా పాలకుర్తి (Palakurthi) చౌరస్తాలో పెట్రోల్ కొరత సమస్యపై ఒక యువకుడు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన రమేష్, బంకుల్లో పెట్రోల్ లభ్యం కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టాడు. పెట్రోల్ అందుబాటులో లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పెట్రోల్ సమస్యపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also: వాట్సాప్ సంచలన నిర్ణయం.. 9400 ఎకౌంట్స్ బ్యాన్
Follow Us On: Sharechat

