వాట్సాప్ సంచలన నిర్ణయం.. 9400 ఎకౌంట్స్ బ్యాన్

కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సుమారు 9,400 వాట్సాప్ ఎకౌంట్స్ (WhatsApp Accounts)ను మెటా సంస్థ బ్లాక్ చేసింది. డిజిటల్ అరెస్టులకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడానికి ఈ గ్రూపులను వాడుతున్నట్లు మెటా కంపెనీ పేర్కొన్నది. ఈ ఏడాది జనవరి నుంచి 12 వారాల వ్యవధిలో అనేక వాట్సాప్ గ్రూపులపై అనుమానం వచ్చిందని, కొన్ని ఫిర్యాదులు కూడా అందాయని తెలిపింది. చాలా వాట్సాప్ గ్రూపులపై నిఘా వేసిన తర్వాత డిజిటల్ అరెస్టు నేరాలకు సంబంధించి 9,400 గ్రూపులను మాత్రమే నిషేధించినట్లు సుప్రీంకోర్టు ఇచ్చిన నివేదికలో మెటా కంపెనీ తరఫు ప్రతినిధి తెలిపారు.

ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు 3,800 వాట్సాప్ ఎకౌంట్స్‌ను (గ్రూపులు) గుర్తించాయని, మెటా కంపెనీ మాత్రం ఇంటెర్నల్ స్క్రూటినీ, సర్వియలెన్స్ వ్యవస్థ ద్వారా 9,400 ఎకౌంట్స్‌ను గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 9,400 ఎకౌంట్స్ (WhatsApp Accounts) వ్యవహారం అనుమానాస్పదంగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చి వాటిని వినియోగం నుంచి తొలగించినట్లు తెలిపారు.

స్కామర్లను గుర్తించేందుకు లోగో మ్యాచింగ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేశామని, పుష్ నేమ్ లాగింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వినియోగించామని తెలిపారు. ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలోని స్కామ్ సెంటర్ల ద్వారా ఈ గ్రూపులు/అకౌంట్ల ద్వారా డిజిటల్ అరెస్టు నేరాలు జరుగుతున్నట్లు వివరించారు. ఢిల్లీ పోలీసులు, ముంబైలోని హెచ్‌క్యూ సీబీఐ, ఏటీఎస్ వంటి పేర్లను నిందితులు వినియోగిస్తున్నారని, వాటి అఫీషియల్ లోగోలను కూడా వాడుతున్నారని, నిర్దిష్టంగా కొద్దిమంది వ్యక్తులను టార్గెట్ చేసి డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరిస్తున్నారని, బాధితులను వివిధ రూపాల్లో భయపెడుతున్నారని ఆ నివేదికలో మెటా కంపెనీ ప్రతినిధి తెలిపారు.

ఇలాంటి నేరాల స్వభావాన్ని విశ్లేషించిన తర్వాత గుర్తు తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే మెసేజ్‌లకు హెచ్చరికలను పంపడం, కాంటాక్ట్ సమాచారంలో ఆ అకౌంట్ ఎప్పటి నుంచి యాక్టివ్‌గా ఉన్నదో కనిపించేలా చేస్తున్నామని, ఇందుకోసం కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టామని వివరించారు. చాట్‌లు అనుమానాస్పదంగా ఉంటే ప్రొఫైల్ ఫోటోలు కనిపించకుండా చేస్తున్నామని తెలిపారు.

Read Also:  రాజస్థాన్‌లో భయానక ఘటన.. గోడలు ఎక్కుతూ బాలిక హల్‌చల్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>