కలం, నిర్మల్ : దస్తురాబాద్ (Dasturabad) మండలం పెర్కపల్లి గ్రామంలో విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి చెందినట్టు ఎస్సై సాయికుమార్ ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన ఎంబాడి సతీష్ (27) అనే యువకుడు శనివారం రాత్రి ఇంట్లో ఉన్న ఇనుప కూలర్ ను పక్కకు జరిపే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

