కలం, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ తనయుడు నిధిష్ ఠాకూర్ (Nidhish Thakur) ప్రతిష్టాత్మక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ (Guinness World Records) టైటిల్లో భాగస్వామిగా నిలిచారు. 2026 ఆగస్టు 9న హైదరాబాద్, తెలంగాణలో నిర్వహించిన అతిపెద్ద తైక్వాండో పాఠంలో 533 మంది పాల్గొనగా, ఈ రికార్డును Jayanth Reddy International Taekwondo Academy & Suman Art Theatres (భారత్) సాధించాయి. ఈ చారిత్రాత్మక గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వామ్యానికి గుర్తింపుగా నిధిష్ ఠాకూర్ Guinness World Records సర్టిఫికెట్ లభించింది.

