ఎల్‌ఓసీ చెక్కులు అందజేత

కలం, నిర్మల్ : అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు మంజూరైన ఎల్‌ఓసీ చెక్కులను ఆదివారం బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) అందజేశారు. సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన గుమ్ముల నర్సింహులు కుటుంబానికి రూ.2 లక్షలు, నిర్మల్ పట్టణంలోని నాయిడివాడకు చెందిన నామెద గంగామణి కుటుంబానికి రూ.75 వేల ఎల్‌ఓసీ చెక్కులను వైద్య చికిత్స నిమిత్తం అందించారు. ఆపద సమయంలో తమ కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>