ప్రేమించ‌డం లేద‌ని యువ‌తిపై క‌త్తితో దాడి!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏలూరు (Eluru) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. త‌న‌ను ప్రేమించ‌డం లేద‌ని ఓ యువ‌తిపై యువ‌కుడు క‌త్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువ‌తి తీవ్ర గాయాల‌పాలైంది. జిల్లాలోని నూజివీడు(Nuzvid)లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. యువ‌తిపై దాడి చేసిన వ్య‌క్తి సురేష్‌ స్థానికంగా ఎల‌క్ట్రీష‌న్‌గా ప‌ని చేస్తున్నాడు. కొద్ది రోజులుగా యువ‌తిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. కానీ, యువ‌తి నిరాక‌రిస్తూ వ‌చ్చింది. దీంతో సురేష్ యువ‌తిపై క‌త్తితో దాడి చేశాడు. ప్ర‌స్తుతం యువ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. పోలీసులు సురేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>