యెన్నం శ్రీనివాస్ రెడ్డికి జర్నలిస్టుల ఘన సత్కారం!

కలం ,మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas) కి మంత్రి హోదా వచ్చిన సందర్భంగా మహబూబ్ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలమూరు జర్నలిస్టు సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ స్పందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండే నాయకుడిగా ఆయన సేవలను కొనియాడారు.

జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మరింత సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి అద్దంలాంటి వారు అని, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంలో వారి పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభ్యున్నతికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వాకిట అశోక్, కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, కోశాధికారి రఘు, సభ్యులు రమాకాంత్ రెడ్డి, తిరుపతయ్య, గోపాల్, కేశవులు , పసుపుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>