Mobile Popup Ad
Mobile Popup Ad

యశ్ ‘టాక్సిక్’ మూవీ రిలీజ్ వాయిదా

కలం, సినిమా : కన్నడ స్టార్ యశ్ (Yash) నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’ (TOXIC) విడుదలపై చిత్రబృందం కీలక ప్రకటన చేసింది. ముందుగా ప్రకటించిన తేదీ జూన్ 4న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయి విడుదల కోసం రీలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా (TOXIC) ఇప్పటికే పూర్తయినప్పటికీ, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ కోసం మరిన్ని భాగస్వామ్యాలు, మార్కెటింగ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. అందుకే విడుదల తేదీని మరింత సమర్థవంతంగా ప్లాన్ చేయాలని నిర్ణయించారు.

ఈ సినిమా మాకు సినిమా మీద ప్రేమను మళ్లీ గుర్తు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందన మాకు మరింత నమ్మకం ఇచ్చింది. సినిమా తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి ఈ సమయం అవసరం అని చిత్రయూనిట్ తెలిపింది. యశ్ మాట్లాడుతూ, ‘ఇది ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి తీసుకెళ్లే అవకాశం. ప్రతి అడుగులో అభిమానుల మద్దతు మాకు బలం ఇచ్చింది’ అని భావోద్వేగంగా పేర్కొన్నారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మూవీ టీం తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>