యాదాద్రి హుండీ లెక్కింపు.. రికార్డుస్థాయిలో ఆదాయం

కలం యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీ న‌ర‌సింహస్వామి ఆల‌యానికి (Yadadri Temple) భారీగా ఆదాయం స‌మ‌కూరింది. స్వామి వారికి నలభై తొమ్మిది రోజులుగా భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల‌ను గురువారం రోజున లెక్కించారు. నలభై తొమ్మిది రోజుల వ్యవ‌ధిలో రూ.3,52,47,662,00 న‌గ‌దు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. కొండ‌కింద  స‌త్యనారాయ‌ణ స్వామి వ్రత మండ‌పంలో హుండీ లెక్కింపు జరిగింది. స్వామి వారికి న‌గ‌దు రూపంలో రూ. 2,66,68,787, మిశ్రమ బంగారం 114 గ్రాములు, వెండి 3 కిలోల 900 గ్రాములు గ్రాముల చొప్పున వ‌చ్చిన‌ట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు. లెక్కింపులో ఈవోతోపాటు ఆల‌య సిబ్బందితో పాటు సేవా సంస్థల స‌భ్యులు పాల్గొన్నారు. ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి వారికి భారీగా విదేశీ క‌రెన్సీ కూడా వ‌చ్చిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

విదేశీ కరెన్సీ కూడా..

అమెరికా – 2047 డాలర్లు, ఇంగ్లాండ్ -190 పౌండ్స్, కెనడా – 85 డాలర్స్, నేపాల్ -180, ఆస్ట్రేలియా -110, వియత్నాం -1,000, మలేషియా – 53, సింగపూర్ -16, సౌదీ అరేబియన్ -116, ఖతార్-2, న్యూజిల్యాండ్ – 5, యూరో-3, సౌత్ ఆఫ్రికా -100, కెన్యా – 100, వివిధ దేశాల కరెన్సీలు సమాకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>