డ్రగ్స్ నిర్మూలనపై యాదగిరిగుట్టలో అవగాహన

కలం, యాదగిరిగుట్ట: డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్టలో ప్రజలకు సీఐ బి.భాస్కర్ (CI Bhaskar) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వాడితే శరీరంతో పాటు మానసిక ఆరోగ్యం, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. స్నేహితుల ఒత్తిడి, ఆసక్తి లేదా తాత్కాలిక ఆనందం కోసం మాదకద్రవ్యాలను ప్రయత్నించి వాటికి బానిసలుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు.

ఒకసారి డ్రగ్స్ వ్యసనానికి గురైతే బయటపడటం కష్టమవుతుందని సీఐ భాస్కర్ హెచ్చరించారు. అందుకే యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగంతో చదువుపై ఆసక్తి తగ్గడం, కుటుంబ సభ్యులకు మానసిక–ఆర్థిక ఇబ్బందులు కలగడం, నేరాలకు పాల్పడే ప్రమాదం పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు ప్రసాద్, ఖాజా మొయినుద్దీన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>