కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డీఈఐసీ)ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి పి. రవీందర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మౌలిక వసతులు, చిన్నారులకు అందుతున్న వైద్య, పునరావాస సేవలను పరిశీలించారు.
వివిధ విభాగాల ద్వారా అందిస్తున్న సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు అందుతున్న ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ తదితర సేవలను పరిశీలించిన ఆయన, కేంద్రం నిర్వహణ, సేవల అమలు తీరుపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గబ్బర్‌సింగ్, డాక్టర్ సంధ్య, డాక్టర్ సతీష్, స్పీచ్ థెరపిస్ట్ తదితరులు పాల్గొన్నారు.

