కలం, యాదగిరిగుట్ట: యాదాద్రిలోని యాదగిరిగుట్టపై నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. దీంతో యాదాద్రి ఆలయ (Yadadri Temple) అధికారులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ పరిసరాల్లో (కొండపై) మరణం సంభవించడంతో ఆలయ సంప్రదాయాల ప్రకారం దోష నివారణ కోసం అధికారులు దర్శనాలను నిలిపివేశారు. ఆలయ ప్రాంగణంలో అవసరమైన శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను అర్చకులు నిర్వహిస్తున్నారు. ఈ సంప్రోక్షణ పూజలు పూర్తయిన తర్వాతే భక్తులకు స్వామివారి దర్శనాలను పునరుద్ధరిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ శుద్ధి కార్యక్రమాల వల్ల కొండపైకి వచ్చిన భక్తులు కొద్దిసేపు నిరీక్షించాల్సి వచ్చింది.

