కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (Panjagutta Police Station) అధునాతన సేవలకు కేంద్రంగా మారనుంది. దేశంలోనే తొలిసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏఐ ఆధారిత సేవలు అందనున్నాయి. రాష్ట్రంలో కేసులు వేగవంతంగా, పారదర్శకతతో విచారణ చేయడం, బాధితులకు త్వరగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్‌లలో ఏఐ ఆధారిత సేవలను ప్రవేశపెట్టాని ఉన్నతాధికారులు భావించారు. దీని కోసం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. నేటి నుంచి పంజాగుట్టలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా నేడు డీజీపీ సీవీ ఆనంద్ పంజాగుట్ట పీఎస్‌ను సందర్శించారు.
ఏఐ ఆధారిత సేవలతో స్టేషన్‌లో బాధితుల సమస్యలు నేరుగా విని ఏఐ మిషిన్ ఫిర్యాదు కాపీని నిమిషాల్లో తయారు చేస్తుంది. బాధితులు పది భాషల్లో తమ సమస్యను చెప్పుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫిర్యాదు కాపీ సంబంధిత ఆఫీసర్లకు ఆటోమేటిక్‌గా పంపబడుతుంది. ఫిర్యాదుల స్వీకరణ నుంచి చార్జ్‌షీట్ మొత్తం ఏఐ ఆధారంగానే జరుగుతుంది. డీజీపీ, నగర పోలీస్ ఉన్నతాధికారులు పంజాగుట్ట పీఎస్‌ను సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి, ఫిర్యాదుదారులతో మాట్లాడారు. ఫిర్యాదులు ఏఐ అనుసంధానం జరుగుతున్న తీరుపై సమీక్ష నిర్వహించారు.

