Mobile Popup Ad
Mobile Popup Ad

MS లిక్కర్ కంపెనీ ఎదుట మహిళల ధర్నా

క‌లం, మెద‌క్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా పుల్కల్ మండలం ఎస్.ఇటిక్యాల గ్రామంలోని MS లిక్కర్ కంపెనీ (MS Liquor Company) ఎదుట మహిళా కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కంపెనీ (MS Liquor Company) లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న రవి అనే వ్యక్తి మహిళా కార్మికులతో అసభ్యంగా, దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగం నుంచి తొలగించాలనే డిమాండ్ చేశారు.

గతంలో కూడా రవి ప్రవర్తనపై ఫిర్యాదులు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన సుమారు 300 మంది మహిళా కార్మికులు విధులను బహిష్కరించి కంపెనీ ఎదుట బైఠాయించారు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించే వరకు విధుల్లోకి తిరిగి చేరబోమని వారు స్పష్టం చేశారు. అనంతరం పుల్కల్ పోలీస్ స్టేషన్‌లో సూపర్ వైజర్ రవిపై మహిళలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>