ప్రజా భద్రతకు పోలీసులు చేసిన సేవలు చిరస్మరణీయం: ఎస్పీ జానకి షర్మిల

కలం, నిర్మల్: ప్రజల భద్రత కోసం జీవితాన్ని అంకితం చేసిన పోలీసు సిబ్బంది సేవలు పోలీసు శాఖ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని నిర్మల్ జిల్లా ఎస్పీ (Nirmal SP) జానకి షర్మిల (Janaki Sharmila) అన్నారు. జిల్లా పోలీసు శాఖలో సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందిని శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎస్‌బీ ఎస్సై నర్సయ్య, నిర్మల్ టౌన్ ఏఎస్సై తారాచంద్, బాసర ఏఎస్సై గంగాధర్, లక్ష్మణచందా పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ శంకర్‌ లను పూలమాల వేసి శాలువాతో సత్కరించి అభినందించారు.

పోలీసు శాఖ అభివృద్ధికి వారు అందించిన సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం అంకితభావంతో పనిచేసే బాధ్యతాయుతమైన సేవ అని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనేది ప్రభుత్వ విధులకు మాత్రమే ముగింపు అని, సమాజ సేవకు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, నిర్మల్ టౌన్ సీఐ సమ్మయ్య, రూరల్ సీఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>