Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాన్‌‌కు ట్యాక్స్ కడుతున్న భారత్.. కారణమిదే!

కలం, వెబ్ డెస్క్: ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా చమురు ధరలు మండిపోతున్నాయి. భారత్ (India) వంటి దేశాలకు గల్ఫ్ నుంచి ఆయిల్ సరఫరా కావాలంటే.. హర్మూజ్ జలసంధి ఒక్కటే మార్గం. ఇది కాస్తా ఇరాన్ ఆధీనంలో ఉండటం.. అగ్ర రాజ్యం దాడులతో దాన్ని మూసివేయడంతో దేశ వ్యాప్తంగా ఇంధన కష్టాలు అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని దేశాలకు చమురు సరఫరా జరిగేలా హామీ ఇచ్చిన ఇరాన్.. అందుకు ట్యాక్స్ కట్టాలని షరతు విధించింది. తాజాగా, దీనికి భారత్ అంగీకరించినట్లు రాయిటర్స్ వెల్లడించింది.

ఒక్కో నౌకకు రూ.18 కోట్లు..

హర్మూజ్ జలసంధి దాటాలంటే ఒక్కో నౌకకు రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఇరాన్ కండీషన్ పెట్టింది. దేశ అవసరాల నేపథ్యంలో ఆ డబ్బులు చెల్లించేందుకు భారత్‌ సహా చైనా, జపాన్ దేశాలు అంగీకరించాయి. అయితే ఈ విధానాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిధులు చెల్లించడమంటే.. హర్మూజ్ జలసంధిపై పూర్తి హక్కులు ఇరాన్‌‌కు ఉన్నట్లు అంగీకరించినట్లు అవుతుందని అగ్రరాజ్యం వాదన. భారత్‌ ఓ వైపు డబ్బులు చెల్లిస్తున్నా.. ఇటీవల కాలంలో రెండు నౌకలపై దాడులు చేయడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>