కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన (Janasena) దృష్టి సారించింది. ఎన్నికల కోసం సన్నద్ధంలో భాగంగా శుక్రవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో పార్టీ ప్రత్యేక కమిటీ సమావేశం అయింది. స్థానిక ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ భేటీలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సందేశాన్ని మంత్రి నాదేండ్ల భాస్కర్ రావు సభ్యులకు వివరించారు.
కాగా, భుజానికి శస్త్ర చికిత్స అనంతరం ఆయుర్వేద చికిత్స కోసం పవన్ కల్యాణ్ కేరళంకి వెళ్లిన కారణంగా ఈ సమావేశానికి ఆయన హాజరు కాలేదు. కాగా, స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై పార్టీ ముఖ్యనేతలు కీలక చర్చలు జరుపుతున్నారు. అలాగే, అభ్యర్థుల ఎంపికతో పాటు కూటమి సమన్వయంపై సమావేశంలో చర్చిస్తున్నారు.
స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాల తయారీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. 14 మందితో కూడిన కమిటీని జనసేన ప్రకటించింది. కమిటీల మండలి బుద్ధ ప్రసాద్, టి.శివశంకర్, కందుల దుర్గేష్, వల్లభనేని బాలశౌరి, బొలిశెట్టి శ్రీనివాస్, దేవ వరప్రసాద్, పత్సపట్ల ధర్మరాజు, సీహెచ్ వంశీకృష్ణ, చిలకం మధుసూదన్ రెడ్డి, లోకం మాధవి, కొటికలపూడి గోవిందరావు, యనమల భాస్కర్, సామినేని ఉదయభాను, కొరొకాన రవికుమార్ సభ్యులు గా ఉన్నారు.

