కరీంనగర్ అభివృద్ధిపై కమిషనర్ ప్రజెంటేషన్

కలం, కరీంనగర్: దేశంలోని పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో నిర్వహించిన జాతీయ అర్బన్ సదస్సుకు కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ (Praful Desai) హాజరయ్యారు. కరీంనగర్‌లో చేపట్టిన నివాస, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, వినూత్న ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌లో నగర రూపురేఖలు ఎలా మారాయి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా అభివృద్ధి చేసిన ఆధునిక పార్కులు తదితర అంశాలపై సదస్సులో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ప్రసంగించారు. అత్యాధునిక క్రీడా మౌలిక వసతులు, ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ వసతుల కల్పనపై ప్రత్యేకంగా వివరించారు. కరీంనగర్‌ను మోడల్ సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా మోడల్ రోడ్లు, మురుగు నీటి డ్రైనేజీ కాలువలు, తదితర ప్రాజెక్టుల ప్రణాళికలు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>