కలం, హనుమకొండ: ఒడిశాలోని భువనేశ్వర్‌లో శనివారం నిర్వహించిన అర్బన్ కాన్క్లేవ్లో వరంగల్ కార్పొరేషన్ (Warangal Corporation)కు అవార్డు లభించింది. హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, కుడా వైస్ ఛైర్పర్సన్ చాహత్ బాజ్‌పాయి ఈ అవార్డును అందుకున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న, కుడా పీఓ అజిత్‌రెడ్డి పాల్గొన్నారు. నగరాల అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై నిర్వహించిన ప్యానెల్ చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

